ఇప్పటికే RRR సినిమా పలు మార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే చివరగా అక్టోబర్ 13 దసరా కానుకగా ఈ సినిమాని కచ్చితంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది.కానీ దసరాకి కూడా ఈ సినిమాని విడుదల చేయడం లేదు.ఈ విషయాన్ని కూడా స్వయంగా జక్కన్న అండ్ టీమ్ తెలియజేసారు. ఇక ఈ సినిమాకి విడుదల తేది ని ఫిక్స్ చేయడం రాజమౌళికి చాలా పెద్ద తలనొప్పిగా మారింది.