'ఆదిపురుష్' సినిమాకి కూడా తాజాగా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్.వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11 న ఈ సినిమాను తెలుగుతో పాటూ హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు..అయితే వచ్చే ఏడాది అదే ఆగస్టు 11 న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సిస్టర్ సెంటుమెంట్ తో తెరకెక్కుతున్న 'రక్షా బంధన్' సినిమా కూడా విడుదల కానుంది.దీని వల్ల టాలీవుడ్ తో పాటు మిగతా చోట్ల కూడా పెద్దగా సమస్య లేకపోయినా..బాలీవుడ్ లో మాత్రం చాలా పెద్ద కాంపిటీషన్ ఏర్పడే అవకాశం ఉంది.