పూరి జగన్నాథ్ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.నిన్నే పెళ్లాడతా షూటింగ్ సమయంలో తాను ప్రేమలో పడ్డానని.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పూరి.అప్పటికీ తన చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదని..కానీ తన ఫ్రెండ్స్ ఆ సమయంలో అండగా నిలిచారని చెప్పాడు.ఇక తన పెళ్లి ఎర్రగడ్డ లోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు.ఇక యాంకర్ ఝాన్సీ తన పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చిందని..ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకువచ్చారని చెప్పాడు.