గత కొన్నేళ్ళుగా ఆలియా భట్, రణబీర్ కపూర్ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమతో ఉన్న విషయం తెలిసిందే.అంతేకాదు కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.ఇక తాజాగా ఈ జంట జోధ్ పూర్ లో దర్శనమిచ్చారు.అక్కడ తమ వివాహ వేదికను వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ పెళ్లి కోసం సరైన వేదికను వెతకడం కోసమే ఈ జంట జోధ్ పూర్ కి వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో ఇప్పటికే పలు ఫ్యాలెస్ లను ఫైనలైజ్ చేసి అందులో ఒకదాన్ని సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.