బాలీవుడ్ ను షేక్ చేసిన రాజ్ కుంద్రా పోర్ణ్ వీడియోల బాగోతంలో రోజుకో అంశం తెరపైకి వస్తూ ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై నటి గెహనా వసిష్ట్ సంచలన ఆరోపణలు చేసింది. ముందు నుండి రాజ్ కుంద్రా కేసుతో లింక్ ఉన్న భామలు కుంద్రాపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అప్పట్లో నటి షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా పరువు తీసేలా మాట్లాడింది. రాజ్ కుంద్రా అనుచరులు మరియు ఆయన తనను బలవంతం చేసి వీడియోలు తీయించారని ఆరోపించింది. విచారణలో కూడా షెర్లిన్ ఆ విషయాన్నే నొక్కి చెప్పింది. ఇక పోర్న్ వీడియోల కేసులో షెర్లిన్ ను ముంబై పోలీసులు ఫిబ్రవరిలో అరెస్ట్ చేసి 133 రోజులు జైల్లోనే ఉంచారు.