ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నసంగతి తెలిసిందే.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాసారు.ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టలపై ఈ సినిమా సాగుతుందట. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు.ఈ క్రమంలో ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి..ప్రత్యర్ధులను చంపుతూ..నిధి వేటకు బయలుదేరుతారు.ఇదే రాజమౌళి మహేష్ కాంబోలో తెరకెక్కే సినిమా కథగా తెలుస్తోంది.