లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి కి బాబాయ్ పాత్రలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆయన తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి..ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. రాజీవ్ కనకాల ఈ పాత్రను చేయడానికి చాలా బాధపడ్డాడని చెప్పుకొచ్చారు.ఈ పాత్ర వల్ల రాజీవ్ కనకాల కొన్ని నిద్రలేని రాత్రులు గడిపారని శేఖర్ కమ్ముల అన్నారు.