ఇంటిపై దాడి జరిగన అనంతరం పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ మరోసారి రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ ఎవరిని అయినా ఏమయినా అనవచ్చని కానీ అయన్ను మాత్రం ఎవరూ ఏం అనకూడదని అన్నారు. ఎలాంటి దాడులు జరిగినా తనకు ఏం భయం లేదని అన్నారు.తనుకు నచ్చిన నాయుకుడు జగన్ అని చచ్చేవరకు ఆయన వెంటే ఉంటానని చెప్పారు. గొప్ప నాయకుడు అయిన జగన్ ను ఒరేయ్ అరేయ్ అని పిలవడం..పేర్ని నాని తండ్రి గొప్ప నాయకుడు అని వారిపై సైకో బుధ్దితో వ్యాఖ్యలు చేశాడని అన్నారు. సినిమా షూటింగ్ ల సమయంలో కూడా పవన్ కల్యాణ్ ఇలానే ప్రవర్తిస్తారంటూ సంచలన ఆరోపణణలు చేశాడు.