తాజాగా ఈ సినిమా చూసినట్టు సింగర్ స్మిత తెలిపి చిత్రం పై ప్రశంసలు కురిపించారు. రిపబ్లిక్ సినిమా దేవకట్టా కు మరో ప్రస్థానం అవుతుందని స్మిత పేర్కొన్నారు. గత రాత్రి ఈ సినిమా చూశాను అని రియల్లీ మైండ్ బ్లోయింగ్ అంటూ ఎగ్జైట్మెంట్ కు గురయ్యారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాల్సిన సినిమా రిపబ్లిక్ అంటూ ప్రశంసించారు. నాకైతే సినిమా చాలా బాగా అనిపించిందని ఇక మీ స్పందన ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను అని స్మిత పేర్కొన్నారు.