తాజాగా ఏపీ లో రిపబ్లిక్ సినిమా ప్రదర్శనను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.తాజాగా జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై , నేతల పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత నుండి గత పది రోజులుగా వైసీపీ నేతలు పవన్ మీద మండిపడుతూనే ఉన్నారు.అయితే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిపబ్లిక్ సినిమాను వైసిపి నాయకులు అడ్డుకున్నారు. అక్కడికి సినిమా చూడడానికి వచ్చిన తేజ్ అభిమానులను కూడా వెనక్కి పంపించేశారు.