ఓ సినిమాని బాధతో ముగిస్తే ఎక్కువ మంది ఆడియన్స్ కి అది నచ్చకపోవచ్చు.బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే.ముఖ్యంగా హీరో, హీరోయిన్ సినిమా చివర్లో చనిపోతే అది ట్రాజెడి అవుతుంది. జాగా విడుదలైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' సినిమాలోనూ ట్రాజెడీ ఎండింగ్ ని చూపించాడు ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎండింగ్ లో హీరో సాయి ధరమ్ తేజ్ మరణిస్తాడు.అయితే ఇది జనాలకుఏ తీరున ఆకట్టుకుంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.