టాలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'.మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథాయకుడిగా జీ స్టూడియస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా సఫలమయ్యాడనే చెప్పాలి.అన్ని సినిమాల మాదిరిగా రొటీన్ గా, సినిమాటిక్ వే లో కథను ముగించకపోవడం ఈ సినిమాకు మెయిన్ పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు.