సాధారణ ప్రజలే కాదు పెళ్లి తరవాత విడాకులు తీసుకుంటే సెలబ్రెటీలు అయినా భరణం చెల్లించాల్సిందే. ఇక ఉన్న ఆస్తి పాస్తులను బట్టి భరణం చెల్లించడం ఉంటుంది. అంతే కాకుండా విడాకులు భర్త కోరుకుంటేనే భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సమంత అక్కినేని నాగ చైతన్యల విడాకుల అంశానికి నిన్నటితో ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. సామ్ తన సోషల్ మీడియాలో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించడంతో మొదలైన విడాకుల చర్చకు నిన్నటితో ఎండ్ కార్డు పడగా విడాకులు తీసుకునేందుకు రకరకాల కారణాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.