నాగ చైతన్య మాత్రం తన విడాకుల తర్వాత చాలా కూల్ గా ఎప్పటిలాగే తన సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అనంతరం చైతూ ఓ వెబ్ సీరీస్ లో నటించనున్నాడు.ఆ వెబ్ సీరీస్ ని కూడా విక్రమ్ కె. కుమారే డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇక వీటితో పాటూ తాజాగా మరో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై చైతూ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మల్టీస్టారర్ కి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.