కొండపొలం సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ తో 'హరహర వీరమల్లు' సినిమాని స్టార్ట్ చేసాడు క్రిష్.కానీ అనుకోకుండా మధ్యలో ఈ చిన్న సినిమాను చేసాడు.సాధారణంగా ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్న టైమ్ లో చిన్న సినిమా చేయడానికి దర్శకుడు సిద్ధం అయినప్పటికీ.. ముందు కమిట్ అయిన ప్రాజెక్టుకు సంబంధించిన హీరో, నిర్మాత అంగీకరించే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది క్రిష్ కి ఇది ఎలా వర్కవుట్ అయ్యింది అనే విషయం పై స్వయంగా తానే స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.