బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకి ఎంతో రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా హౌస్ లో ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారో ఎవరికి అర్ధం కాని పరిస్థితి.ఇందులో భాగంగానే ఐదవ వారం నామినేషన్స్ హౌస్ ని మరింత హీటెక్కించాయి.యూట్యూబ్ స్టార్ షణ్ముక్ ని ఏకంగా ఎనిమిది మంది హౌస్ మేట్స్ నామినేట్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.అంతేకాదు ఇప్పటివరకు షణ్ముక్ ని నామినేట్ చేయని వాళ్ళు కూడా షణ్ముక్ ని టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు.