'అలీతో సరదాగా'అనే కార్యక్రమానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే 249 ఎపిసోడ్ లను అలీతో సరదాగా ప్రోగ్రాం పూర్తి చేసుకుంది. ఇక 250 వ ఎపిసోడ్ కి గానూ మోహన్ బాబుని ఆహ్వానించారు షో నిర్వాహకులు. ఇందులో భాగంగా గత వారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో తన వ్యక్తిగత,సినీ జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు.ముఖ్యంగా నటుడిగా తన ప్రస్థానం ఎలా మొదలైంది,ఇండ్రస్టీ లో రావడానికి ఎన్ని ఇబ్బందులు,అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది..ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.