టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొండపొలం'.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.అక్టోబర్ 8 న విడుదల కానున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ క్రిష్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. సినిమా కథ విషయానికొస్తే.. నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకొని కొండ మీదకి వెళ్తారు. అక్కడ జరిగే పరిణామాలేంటి?అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దర్శకుడు తెలిపారు.