సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10 న జరిగే ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల ప్యానెల్స్ లో ప్రధాన పోటీ నెలకొంది.అయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటె తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా మరోసారి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.