తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొదలై.. ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వాళ్లలో 6 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు లోబో.బిగ్ బాస్ లోకి రాకముందు లోబో చాలామందికి తెలియదు.కానీ ఇతను హౌస్ లోకి వచ్చాక..అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు.దీంతో లోబో గురించి తెలుసుకోవడానికి చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.