తాజాగా జరిగిన మాఈ ఎన్నికలు తనకు కనువిప్పు కలిగించాయని... బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే అసోసియేషన్ నుంచి తాను వైదొలగలాని నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో తెలిపారు. ప్రకాశ్ రాజ్ వెంట తాను ఎల్లప్పుడూ నిలబడే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.