వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్టు భోగట్టా. అదేవిధంగా దర్యాప్తుకు సహకరించాలని కూడా రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలీసులు కోరినప్పుడు విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను