10/15/2012 2:41:00 PM
Prasad
17న ‘గుండెల్లో గోదావరి’ ఆడియో
మంచు లక్ష్మీ ప్రసన్న నటిస్తూ నిర్మిస్తున్న సినిమా గుండెల్లో గోదావరి. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మంచు లక్ష్మీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆది, తాప్సీ, సుదీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, ఈ గుండెల్లో గోదావరి సినిమా ఆడియో విడుదల వేడుక ఈ నెల 17న జరగనుంది. ఈ కార్యక్రమం గంధర్వమహల్ సెట్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర మాంత్రికుడు ఇళయరాజా రూపొందించిన ఈ సినిమా పాటలు అభిమానుల మదిని దోచుకుంటాయని లక్ష్మీ ప్రసన్న అంటుంది.
‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాకు గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఉన్న లక్ష్మీ ప్రసన్న ఈ గుండెల్లో గోదావరి సినిమా తనకు తొలి హిట్ ఇస్తుందని చాలా ధీమాగా ఉంది.