హాస్య నటుడు నుంచి హీరోగా మారిన సునీల్ తన 40 జన్మదినాన్ని గురువారం నాడు జరుపుకున్నాడు. హైదరాబాద్ లో ఒక పాఠశాలలో అంధ బాలల మధ్య తన పుట్టినరోజు వేడుక నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా 2 లక్షల రూపాయిల విరాళాలను పాఠశాల యాజమాన్యానికి సునీల్ అందచేశాడు. సునీల్ నటించిన ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇషాచావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యానిట్ చెపుతుంది. ఈ సినిమాలో డాన్సులు, ఫైట్ల కోసం సునీల్ పడిన శ్రమ వృధా పోదని దర్శక, నిర్మాతలు చెపుతున్నారు. 1974 ఫిబ్రవరి 28న భీమవరంలో సునీల్ జన్మించాడు. సినిమాల్లో నటించాలనే మక్కువతో హైదరాబాద్ చేరుకున్నాడు. చిన్న చిన్న పాత్రలతోనే చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన డైలాగ్ డెలవరీతో కామెడీ నటుడిగా రాణించాడు. ఇప్పుడు పాటల్లో, ఫైట్లల్లో ప్రతిభ చూపిస్తూ హీరోగానూ మెప్పిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: