ఎప్పుడైనా ఎక్కడైనా సంచలనం అనేది వినపడ్డది అంటే అది కూడా సినిమా ఇండస్ట్రీలో అది కేవలం ఆర్జివి వల్లే అని అనుకుంటారు. పిచ్చి కూతలు కూస్తుంటాడు.. ఎవరేం పట్టించుకోరు అనుకుంటున్నా.. వర్మ మాటల పదునెంతో అందరు రుచి చూసిన వారే. అయితే సడెన్ గా ఈరోజు ఏమైందో ఏమో ఆ సంచలన దర్శకుడి నుండి వినకూడని మాట వినాల్సి వచ్చింది. అదే సారీ తెలుగులో క్షమాపణ. ఏంటి వర్మ సారీ అని అనేస్తాడా అసలు ఆయన నోటి నుండి ఇలాంటి మాటలు కూడా వస్తాయా అని ఆశ్చర్యపోవచ్చు.. అదేనండి ఆయన ట్వీట్ లో అలాంటి మాట ఒకటి వాడొచ్చు అని ఊహించకపోవచ్చు.
ఏదైనా సరే నిక్కచ్చిగా తన మనసులో ఏముందో అదే ట్వీట్ రూపంలో వ్యక్తపరిచే వర్మ కొద్దిరోజులుగా మెగాస్టార్ 150వ సినిమా గురించి వివిధ రకాలుగా ట్వీట్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్స్ కు మెగా ఫ్యాన్స్ నుండి ఘాటైన రెస్పాన్స్ వచ్చినా బెదరని వర్మ. కొద్ది గంటల క్రితం జరిగిన ఖైది నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా బ్రదర్ నాగబాబు సంధించిన బాణాలకు మోకరిల్లక తప్పలేదు.
ఇండైరెక్ట్ గా వర్మని అక్కుపక్షి అన్న నాగబాబు వాడికి సినిమాలు తీయడం రాక మెగా ఫ్యామిలీ మీద మెగాస్టార్ మీద ట్వీట్స్ చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. మాట్లాడిన మూడు నిమిషాల వ్యవధిలో ప్రముఖ రచయితకు.. సంచలన దర్శకుడు వర్మకు అక్షింతలు వేసిన నాగబాబు తన మనసులోని ఆవేదనను వెళ్లబెట్టారు.
అయితే ఇది జరిగిన కొద్ది నిమిషాలకే వర్మ నుండి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. నేనేదో నా స్టైలో అందరి మీద అన్నిటి మీద ఒపినియన్ చెబుతున్నా కాని మీ ఫ్యామిలీ మీదే కాదు అన్నాడు.. అంతేకాదు నా ట్విట్లు మోడి గురించి, బచ్చన్ గురించి నా మీద కూడా నేనే చాలా కామెంట్లు చేసుకున్నా.. అయితే నా ట్వీట్స్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారని తెలిసింది.. అందుకే నేను మీకు మీ ఫ్యామిలీకి నా సారీ చెబుతున్నా అని ట్వీట్ చేశాడు వర్మ. అయితే వర్మ ఇలా నాగబాబు మాటలకు క్షమాపణ చెప్పడం అందరికి ఆశ్చర్య పరుస్తుంది. అయితే వెంటనే తన ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి మెసేజులు చేసారంటూ మరో బాంబ్ పేల్చాడు వర్మ. అంతేకాదు మెగా బ్రదర్ కు వర్మ రియాక్షన్ కూడా అదే రేంజ్ ఉండటం విశేషం. మరి ముందు సారీ అని మళ్ళీ క్లాస్ పీకడానికి గల కారణాలు ఏంటో వర్మకే తెలియాలి.