తెలుగు ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగని రీతిలో ఎన్నో రికార్డులు స్థాపించి ప్రపంచంలో తెలుగోడి సత్తా ఏంటో నిరూపించిన చిత్రం ‘బాహుబలి’.  ఎస్ ఎస్ రాజమౌళి దాదాపు రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన ఫ్యూజువల్ వండర్ చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రంతో  తెలుగు చిత్ర పరిశ్రమ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.  తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులు కైవసం చేసుకుంది. అంతే కాదు జాతీయ చిత్రంగా అవార్డు అందుకున్న బాహుబలి చిత్రానికి సీక్వెల్ బాహుబలి 2 తెరకెక్కిస్తున్నారు.
Image result for baahubali 2 posters
 ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టే అంటున్న రాజమౌళి ఈ నెల 16 న భారీ ఎత్తున ట్రైలర్ రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నారు.  బాహుబలి చిత్రంతో ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు.. గ్రాఫిక్స్.. యాక్టింగ్.. పలు అంశాల్లో దర్శకుడు రాజమౌళి ఓ స్టాండర్డ్స్ సెట్ చేశారు.  ఇక బాహుబలి చిత్రం రిలీజ్ కి ముందు జక్కన్న సోషల్ మీడియాలో సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచారు.  
Image result for baahubali 2 posters
పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్, వర్కింగ్ వీడియోలు, ట్రైలర్ ఇలా అన్ని విషయాల్లోనూ ఎంతో జాగ్రత్త తీసుకొని సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్లారు. ఇప్పుడు 'బాహుబలి: ది కంక్లూజన్'  విషయంలోనూ మెల్లి మెల్లిగా చక్కటి స్ట్రాటజీతో బాహుబలి 2 చిత్రం కోసం రాజమౌళి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాడు.ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేసిన రాజమౌళి త్వరలో ఆడియో వేడుకని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Image result for baahubali 2 posters
కాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రం ట్రైలర్ ని ముంబై వేదికగా ఈ నెల 15 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని ఇప్పటికే చూసిన రాజమౌళి సోదరుడు...సంగీత దర్శకుడు కళ్యాణ్ రమణ(కళ్యాణ్ మాలిక్) సోషల్ మీడియాలో ఇలా స్పందించారు.  ట్రైలర్ ని చూస్తుంటే నా గుండెలు అదిరిపోయినీయ్! సినిమాతో సంబంధం లేకుండ ఇది విడిగా 100 రోజులు ఆడుతుందని అన్నారు.  ఏప్రిల్ 28 న విడుదల కానున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. 

Rajamouli’s brother tweet about Baahubali trailer

ట్విట్ :



మరింత సమాచారం తెలుసుకోండి: