టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది. అందుకే హిట్ వచ్చినా రాకున్నా హీరోయిన్స్ మాత్రం ఇక్కడే ఉంటారు. ప్రస్తుతం తెలుగులో ఒక్క హిట్ కూడా లేని అమ్మడు కోటి డిమాండ్ చేసి దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తుంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే బికినీ బ్యూటీ పూజా హెగ్దె అని తెలుస్తుంది.
మోడల్ గా పాపులారిటీ సంపాదించిన పూజా హెగ్దె కోలీవుడ్ జీవా సరసన మాస్క్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో అమ్మడి క్యూట్ లుక్ చూసి తెలుగులో ముకుంద ఛాన్స్ దక్కించుకుంది. అది ఎలా ఉన్నా సరే ఒక లైలా కోసం సినిమా ఛాన్స్ కొట్టేసింది. అది అంతగా ఆకట్టుకోలేకపోయినా సరే బాలీవుడ్ లో హృతిక్ సరసన మొహెంజోదారో సినిమాలో నటించింది పూజా హెగ్దె.
కెరియర్ లో సూపర్ హిట్ ఒక్కటి లేకున్నా సరే అమ్మడికి డిమాండ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న డిజె సినిమాలో నటించిన పూజా ఈ సినిమాతో తన ఫేట్ మారడం ఖాయమని చెబుతుంది. ఇక బన్నితో ఒక సినిమా చేసిందో లేదో తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఆలోచనతో రెమ్యునరేషన్ కోటి చేసేసిందట.
డిజె హిట్ అయితే ఇక కాబోయే స్టార్ పూజా హెగ్దె అని చెప్పేయొచ్చు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు పూజా హెగ్దెను హీరోయిన్ గా ఓకే చేశారట. ఆ సినిమాకు పూజా హెగ్దె కోటి వసూళు చేస్తుందట. మొత్తానికి కెరియర్ అటు ఇటుగా ఉన్నా డిమాండ్ మేరకు అమ్మడికి అలా టైం కలిసి వస్తుందని అంటున్నారు.