నిన్న అర్దరాత్రి నుండి ‘అజ్ఞాతవాసి’ అర్దరాత్రి షోల హంగామా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యనగారాలలోని అన్ని ధియేటర్స్ లోను ‘అజ్ఞాతవాసి’ కోసం స్పెషల్ షోలు వేయడంతో ధియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. దీపావళి మళ్ళీ వచ్చిందా అన్నట్లుగా ధియేటర్స్ ముందు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ తెగ సందడి చేసారు.
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఈ హడావిడికి పవన్ అభిమానులతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడ తోడవ్వడం హాట్ న్యూస్ గా మారింది. ఈసినిమాకు సంబంధించి తొలిరోజు టికెట్స్ సంపాదించడం ఎలా అన్నది ఒక పజిల్ గా మారిపోవడంతో ఈసినిమాని తాము కూడ చూడాలి అని కోరుకుంటున్న నందమూరి అభిమానులు మాత్రం ఒక చక్కటి ప్లాన్ ఆలోచించినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలోని చాల ప్రాంతాలలో బాలయ్య అభిమానులు పవన్ అభిమానులతో బేరాలు పెట్టేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ మూవీకి తమకు టికెట్స్ ఇవ్వాలని బదులుగా ‘జైసింహా’ రిలీజ్ తర్వాత ఆ సినిమా టికెట్స్ ఇస్తామని పవన్ అభిమానులకు బాలయ్య అభిమానులు ఆఫర్స్ ఇస్తున్నట్లు టాక్.
దీనికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతూ అవసరం అయితే నందమూరి ఫ్యాన్స్ కు తమ టికెట్స్ ఇచ్చేసి అయినా వారు సినిమా చూసేందుకు సహకరిస్తామని కొన్నిచోట్ల పవన్ ఫ్యాన్స్ ప్రతిజ్ఞలు కూడా చేసేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో పవన్ బాలయ్యల అభిమానుల మధ్య ఈ స్నేహ సంబంధాల వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి..