మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఓ చిన్న టీజర్ తో ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో అమ్మడు పలికించిన హావభావాలకు భాషతో సంబంధం లేకుండా సిని ప్రియులంతా ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సైతం ఆమె గురించి ప్రస్థావించడం ఆమెను ఇమిటేట్ చేయడం జరిగింది.


ఆ టీజర్ క్రేజ్ తో ప్రియా వారియర్ కు సోషల్ బ్లాగ్స్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. ఇక ప్రియా ఇన్ స్టాగ్రాన్ ఫాలోవర్స్ అయితే ఏకంగా ఓ స్టార్ హీరోకి ఉన్న రేంజ్ లో ఉంది. అందుకే ఇన్ స్టాగ్రాం లో ఆమె ఫాలోయింగ్ చూసి వాణిజ్య ప్రకటనలకు అడుగుతున్నారట.


తన ఇన్ స్టాగ్రాం పేజ్ లో తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే ఏకంగా 8 లక్షల దాకా పారితోషికం ఇస్తామన్నారట. కేవలం ఓ చిన్న యాడ్ కు అమ్మడికి అంత డిమాండ్ ఏర్పడిందన్నమాట. తను చెప్పే ప్రతి మాట ట్రెండ్ అవుతుండటంతో ప్రియాతో ప్రమోట్ చేయించుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి.


మొత్తానికి అమ్మడు ఈ క్రేజ్ ను ఎలా వాడుకోవాలో అలా వాడేస్తుంది. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్లు కూడా వచ్చాయని తెలుస్తుంది. చూస్తుంటే ప్రియా సౌత్ సూపర్ హీరోయిన్ గా అవతారం ఎత్తబోతుందని అంటున్నారు. మరి అది నిజం అవుతుందా కాదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: