తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మద్య వరుసగా సినిమాలు తీస్తూ జోష్ మీద ఉన్నారు. లింగ, కబాలి, కాలా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేక పోయాయి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాతో భారత దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా సీక్వెల్ 2.0 సుమారు రూ.500 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రూ.800 కోట్లు వసూళ్లు చేసి ఇంకా వసూళ్ల దిశగా సాగుతుంది.
2.0 సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పెట్టా’మూవీలో నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఆ మద్య పెట్టా సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోస్‌లలో రజనీకాంత్ లుక్ సరికొత్తగా ఉండడంతో అభిమానులు పేట మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా ఈ నెల 28న చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు సన్ పిక్చర్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటి వారంలో భారీగా, విభిన్నంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా త్రిష గ్లామర్, సిమ్రన్ అభినయం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని అంటున్నారు. చిత్రంలో రజనీకాంత్ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు.