పెళ్లి అంటే అదో వైభవం.. వధువు మెడలో మూడు ముళ్లు పడ్డాయంటే చాలు ఆమె పెళ్లి అయినట్టే. అది ఎవరైనా సరే.. అయితే సినిమా సెలబ్రిటీస్ రియల్ పెళ్లిళ్లు అయిన వారైనా సరే ఒక్కోసారి మళ్లీ రీల్ పెళ్లిళ్లు చేసుకుంటారు అదెలా సాధ్యం. అసలు రీల్ పెళ్లి ఎలా జరుగుతుంది అన్న విషయమై టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని కోడలు సమంత ఓ టాప్ సీక్రెట్ రివీల్ చేసింది.
సమంత నటించిన ఓ బేబీ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత మై విలేజ్ షో సెలబ్రిటీ గంగవ్వతో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో సమంత సినిమాలో మీరు పెళ్లి చేసుకున్నారు కదా మీ ఆయన ఏమనలేదా అన్నది. అయితే సినిమా పెళ్లిలో కేవలం రెండు ముళ్లే వేస్తారని చెప్పింది సమంత.
ఏదో కెమెరా కోసం అలా ఒకటి రెండు ముళ్లు వేస్తారు అంతే తప్ప మూడు ముళ్లు ఒక్కసారే వేసుకుంటారు అది కూడా రియల్ లైఫ్ లోనే అనేసింది సమంత. సో ఇన్నాళ్లు సినిమాల్లో పెళ్లి సీన్స్ అన్ని కేవలం ఒకటి రెండు ముళ్లతో సరిపెట్టినవే అన్నమాట. అయితే ఈ ఇంటర్వ్యూలో సమంతని మీ భర్తని ఎంత ఇచ్చి కొనుక్కున్నారంటూ అడిగింది గంగవ్వ.
కట్నమా చాలా ఇచ్చా అంటూ గంగవ్వ చెవిలో చెప్పింది సమంత. సమంత చెప్పిన ఆన్సర్ కు అన్ని పైసలిచ్చి కొన్నావా అంటూ గంగవ్వ ఆశ్చర్యపోయింది. ఇక పక్కనే ఉన్న డైరక్టర్ నందిని రెడ్డి నా దగ్గర అన్ని పైసల్లేవు అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్పింది. మై విలేజ్ షోతో పాపులర్ అయిన గంగవ్వ ఈమధ్య మల్లేశం బయోపిక్ లో నటించి మెప్పించింది.