అనిల్ రావిపూడి సినిమాలు చూసిన ప్రతీ ఒక్కరూ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అంశం ఒకటే..అదే కామెడీ. మొదటి సినిమా పటాస్ నుండి మొన్నటి ఎఫ్ 2 వరకు అనిల్ అందిస్తున్న కామెడీ థియేటర్లలో ప్రేక్షకుల చేత నవ్వుల పంట పండిస్తుంది. మొన్న వచ్చిన ఎఫ్ 2 అయితే కేవలం ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగానే 100 కోట్ల గ్రాస్ వరకు కలెక్షన్లు సాధించిందంటే అనిల్ కి కామెడీలో ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి, మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలోని మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ పాటలు ఏమంత కొత్తగా లేవనే టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ నుండి ప్రేక్షకులు చాలా కొత్తరకమైన సంగీతాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అలాంటి సంగీతం ఇప్పటికే విడుదల అయిన మూడు పాటల్లో కనిపించట్లేదని వాదన. అయితే మొన్నటికి మొన్న విడుదల అయిన హీ ఈజ్ సో క్యూట్ అనే పాట కొంతలో కొంత నయం అని తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్ అభిమానులకి ఇదే టెన్షన్ పట్టుకుంది. సినిమాలో పాటలు ఈ రకంగా ఉంటే ఎలా అని అనుకుంటున్నారు. అయితే దానికి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమాల్లో పాటలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ సినిమాలోనూ మ్యూజిక్ అంతగా పేలలేదు. అతను సంగీతం మీద పెద్దగా ఆధారపడడు.
వినోద ప్రధానంగా సాగే అతడి చిత్రాల్లో పాటలకు పెద్ద ప్రాధాన్యం కూడా ఉండదు. కొన్ని పాటల్ని స్పైసీగా తీసి మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిగతా అంతా వినోదం, హీరో ఎలివేషన్ల మీద సినిమా నడిచిపోతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ అలానే జరుగుతుందని నమ్ముతున్నారు. మరి వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నెరెవేరుతుందా లేదా చూడాలి.