సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండగే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఎందుకంటే గతంలో వరుస డిజాస్టర్ల  తర్వాత చిత్రలహరి తో ఒక హిట్టు పొందాడు సాయి ధరంతేజ్. ఇక ఇప్పుడు ప్రతి రోజు పండుగే సినిమా విజయం సాధిస్తే తన కెరీర్ని గాడిలో పెట్టుకొని దూసుకుపోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించగా  ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించాడు . గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 

 

 

 

 ఈ సినిమా ఇప్పటికే విడుదలవ్వగా ప్రేక్షకుల నుంచి భిన్నమైన టాక్ వస్తోంది. సాయి ధరంతేజ్ తాత సత్యరాజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. దీంతో తన తాత చివరి రోజుల్లో నైనా హ్యాపీ గా ఉంచేందుకు విదేశాల నుంచి సాయి ధరంతేజ్ రాజమండ్రి వస్తాడు. ఇక మనవడు వచ్చాక తన కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చేందుకు వేసే ప్లాన్లు ఇవన్నీ సినిమాలో బాగుంటాయి. కామెడీ కూడా అదరగొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. సెకండాఫ్ విషయానికి వస్తే మాత్రం ఏదో అక్కడక్కడా కామెడీ సీన్ ఇరికించి .. ఎమోషనల్ మోడ్ లోకి తీసుకెళ్తాడు దర్శకుడు. ఎమోషన్ సీన్ లలో కూడా సాయి ధరంతేజ్ పర్ఫామెన్స్ అది పోయినప్పటికీ... మారుతి టేకింగ్ మాత్రం ఓవర్ ఎమోషన్ డోస్  ఇరికించి నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. 

 

 

 అంటే ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో కామెడీ పరంగా ఎమోషన్ పరంగా పర్ఫామెన్స్ ఇరగదీశాడు. కానీ మారుతి మాత్రం గతంలో బలే బలే మగాడివోయ్ మహానుభావుడు సినిమాలో లాగా ఈ సినిమాలో తన మార్కును చాట కోల్పోయాడు అని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాకి మారుతి టేకింగ్ కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మారుతి టేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఎమోషన్ ఓవర్ డోస్ కాకుండా సరైన స్థాయిలో ఉండి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొత్తంగా అయితే నాలుగు కామెడీ సీన్లు.. 2 ఎమోషనల్ డోస్ ఎక్కువగా ఉన్న సీన్లతో సినిమా గడిచిపోతుంది.

Find out more: