యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవన్ దర్శకత్వం లో 'వరల్డ్ ఫెమస్ లవర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రాశి ఖన్నా ,కేథరిన్ ,ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా హీరోయిన్లు గా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశ లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బం గా ఈ చిత్రం విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదలయింది,. విజయ్ ఏది చేసిన కూడా కాస్త కొత్త గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విజయ్ నటిస్తున్న వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రం నుండి టీజర్ విడుదలయింది. ఈ టీజర్ లో ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్ అంటూ మొదలయిన డైలాగులు యువతను ఆకట్టుకునే లా ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా పూరి, విజయ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ మేరకు ఈ చిత్ర టైటిల్ ను ' ఫైటర్' ఖారారు చేశారు. ఈ సినిమా కథ రెడీ కావడంతో ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా, విజయ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ కోసం బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిం పనిచేయబోతున్నారట..
ఇకపోతే పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్ర సన్నివేశాలు అన్నీ ముంబాయిలో చిత్రీకరించనున్నారట. యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ లుక్ కొత్తగా ఉండబోతుందట. అందుకోసమే సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ప్రస్తుత విజయ్ స్టైలిష్ లుక్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.