బహుముఖ ప్రజ్ఝాశాలి భానుమతి అంటే తెలుగు వారి కి అందరికీ అభిమానమే. అలాగే భానుమతికి తొలితరం కథానాయిక కాంచనమాల అంటే అభిమానమట. ‘కృష్ణ ప్రేమ’ సినిమా కోసం మద్రాసులో బస చేసిన భానుమతికి అదే వీధిలో కాంచన మాల వుంటున్న విషయం తెలిసి చాలా ఆనంద పడింది.
అలాగే ప్రతీ రోజు ఉదయం తమ బస చేసిన ఇంటి ముందు నుంచే కాంచన మాల కారులో వెళ్లుతుందని తెలిసి, రోజూ అదే సమయానికి భానుమతి అక్కడ వేచి చూడడం ప్రారంభించింది. కాంచన మాల అద్భుత సౌందర్యం చూసి భానుమతి అశ్చర్యపోయేదట. తనను చూడటానికి భానుమతి పడుతున్న తాపత్రాయాన్ని చూసి కాంచనమాల అందమైన ఓ నవ్వు నవ్విందట. అంత అందమైన నవ్వు తన జీవితంలో చూడలేదని భానుమతి డైరీ లో రాసుకున్నారు.
కాగా, కాంచన మాల భర్త క్షయవ్యాధితో బాధపడుతున్నాడని, అతని వైద్యం నిమిత్తమే కాంచనమాల రోజూ కారులో వెళ్లేదని తెలుసుకుని కూడా భానుమతి చాలా బాధపడ్డారు.
మరింత సమాచారం తెలుసుకోండి: