అడవికి రాజు సింహం అంటారు... ఒక్కసారి గట్టిగా సింహం గర్జిస్తే.. కొన్నిజంతువులు భయంతోనే చనిపోతాయని అంటారు. నిజంగా మగ సింహాం రాజసం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.. పెద్ద జూలు.. భీకరమైన గాండ్రిపుతో ఏలాంటి జంతువువైనా గజ గజ వణికిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికా సింహాలు అంటే ఎంతో పెద్దగా ఉంటాయి.. వాటి దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా షూటింగ్ చేసేవారు భయపడిపోతుంటారు. ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని అల్ ఖురేషీ పార్క్‌లోని సింహాలను చూస్తే అవి సింహాలేనా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ సింహాలు చూస్తుంటే ఈ రోజా..రేపా అన్నట్టు ఉన్నాయి. ఒకదశలో బక్కచిక్కిన పిల్లులా అన్న అనుమానం రాక తప్పదు.
సాధారణంగా అడవుల్లో, జూ పార్కుల్లో సింహాలను చూస్తే భయపడే వారు నిజంగా ఈ సింహాలను చూస్తే కన్నీరు పెట్టుకుంటారు.. అయ్యో పాపం ఎంత ఘోరమైన దుస్తితి అని బాధపడతారు. ప్రస్తుతం సుడాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొంటోంది. దీంతో ఆహార ధరలు ఆకాశానంటుతున్నాయి. మరోవైపు కరెన్సీ కొరత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో ఉన్నారు. అలాంటపుడు వన్యమృగాల పరిస్థితి ఏంటో చూస్తే అర్థం అవుతుంది. సూడాన్ రాజధాని కార్టోమ్ లోని అల్ ఖురేషి పార్క్ లోని సింహాలకు కొన్ని వారాలుగా తినేందుకు ఆహారం లేదట. అంతేకాదు అనారోగ్యంకు గురైన సింహాలకు సరైన చికిత్స, మెడిసిస్స్ కూడా అందుబాటులో లేవు.
దాంతో అక్కడి సింహాలు చిక్క శల్యమవుతూ.. ఎముకలు బయటకు వస్తున్నాయి. ఆ పార్క్‌కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. సందర్శకులు వీటి పరిస్థితి చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. కాగా, ఉస్మాన్ సలీహ్ అనే జంతు ప్రేమికుడు ఫేస్‌బుక్ ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఈ సింహాల పరిస్థితిని చూసి తనకు ఎంతో జాలి వేసిందని ఉస్మాన్ తెలిపాడు. జంతు ప్రేమికులు ఈ సింహాలను ఆదుకోవాలని సహాయం అర్థించాడు.