సినీ రంగం అంటేనే అవకాశాల ప్రపంచం.. ఇక్కడ సక్సస్ మాత్రమే మాట్లాడుతుంది. అంతే కాదు.. సినీరంగంలో ఉండే కళాకారులకు ఉండే ఒడిదొడుకులు మరే ఇతర రంగంలోనూ అంత ఉండకపోవచ్చు.. సినిమా హిట్టయితే చాలు అంతా ఆకాశానికెత్తుతారు. నీ అంతటి వాడు లేడంటారు. ఒక్క సినిమా ఫట్ అంటే చాలు.. మళ్లీ మనవైపు ఎవరూ తిరిగి చూడరు. అందులోనూ ఈ సినిమా రంగంలో ఆదాయం స్థిరంగా ఉండదు.

 

 

అందుకే ఎవరైనా సరే.. నాలుగు డబ్బులు వచ్చే సమయంలోనే రేటు పెంచేస్తారు.. ఈ సినీరంగంలో చాలా వరకూ ఎవరూ విలన్లు ఉండరు.. కానీ పరిస్థితుల ప్రభావంగా అంతా తమ బాగు తాము చూసుకుంటారు. ఎవరినీ తప్పుబట్టలేం. కానీ ఇలాంటి అనిశ్చితి ఎక్కువ ఉన్న సినిమా రంగంలోనూ అక్కడక్కడా చాలా మంచివాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారికి ఉదాహరణ ఓ హీరోయిన్ తల్లి.

 

IHG

 

ఒకప్పటి హీరోయిన్ తులసి గుర్తుందా.. శంకరాభరణంలో చిన్నపిల్లవాడి పాత్రతో బాగా పాపులర్ అయిన ఆమె అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు తల్లి పాత్రలు వేస్తోంది. ఆమె పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. వాళ్ల అమ్మవాళ్లది తాడేపల్లిగూడెం. తులసి తాతయ్యకు తులసి వాళ్ల అమ్మ ఒక్కతే కూతురు. తులసి వాళ్ల అమ్మకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా చెన్నై వచ్చేశారు.

 

 

రావడంతోనే చెన్నైలో ఇల్లు కొనేశారు. తులసి వాళ్ల నాన్న బిజినెస్‌ చేసేవారు. తులసికి మూడేళ్ల వయసు ఉండగా, ఆయన చనిపోయారు. అక్కడి నుంచి అన్నీ తులసి వాళ్ల అమ్మే చూసుకునేవారు. ఆమె చేసిన దానధర్మాల వల్లే తమ కుటుంబం ఈ స్థాయిలో ఉందంటున్నారు తులసి. అందరికీ ఇవ్వడం ఆమే నేర్పించారట. ఆ రోజుల్లో తులసి వాళ్ల అమ్మ తమ ఇంట్లో పనిచేసే వాళ్లకు ఏడు ఇళ్లు కట్టించి ఇచ్చారట. నిజంగా గ్రేట్ కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: