అమలాపాల్, విజయ్ విడిపోవడానికి అతనే కారణం: విజయ్ తండ్రి అజగప్పన్ ...!
అమలాపాల్.. కేరళకు చెందిన ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలోకి రామ్ చరణ్ సరసన నాయక్ సినిమాలో అందరికి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేది. ఇటీవల ఆడే సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.
పెళ్లయి సంవత్సరం కాక ముందుకే ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరికి వారు స్వతంత్రంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణం ఇరువురి మధ్య ఉన్న మనస్పర్ధలు అని అర్థమవుతుంది. వీళ్లు ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి స్టార్ హీరో రజినీకాంత్ అల్లుడు ధనుష్ ముఖ్య కారణమని వార్తలు కూడా రావడం జరిగింది. ఇది ఇలా ఉండగా తాజాగా అమలాపాల్ ఇలా విడిపోవడానికి గల కారణాలు విజయ్ తండ్రి అజగప్పన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. విజయ్ తండ్రి మాట్లాడుతూ.. విజయ్, అమలాపాల్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరి కుటుంబాల పెద్దలనీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి అనంతరం అమలాపాల్ సినిమాలు చేయటం అసలు దర్శకుడికి విజయ్ కు ఇష్టం లేదు. ఈ తరుణంలోనే విజయ్ ఇష్టప్రకారమే ఇక నుంచి సినిమాలు తీయను అని అమలాపాల్ మాట ఇవ్వడం జరిగింది. కానీ అమలా పాల్ మాత్రం పెళ్లి అనంతరం కూడా వరుసగా సినిమాలు చేయడం.. నాకు నచ్చలేదు. అంతేకాదు మేము చెప్పిన, అమలాపాల్ తల్లిదండ్రులు చెప్పినా కూడా మాట మీద వినలేదు అంటూ చెప్పుకొని వచ్చాడు విజయ్ తండ్రి. ఇలా వినకపోవడంతో విడాకుల వరకు రావాల్సి వచ్చింది అని తెలిపాడు. దీనితో పాటు విజయ్ ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాడు అంటూ స్పష్టంగా తెలియజేశాడు తన తండ్రి..