బ్రహ్మానందం.. ఈ పేరు చెప్పగానే మన పెదాలపై నవ్వులు విరుస్తాయి. హాస్యానికి ఆయన చిరునామాగా మారారు. బ్రహ్మనందంకు ఉన్నంత లాంగ్ సినీ కేరీర్ మరే కమెడియన్ కూ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ విధంగా చూస్తే.. ఆయనంత సక్సస్ ఫుల్ కమెడియన్ తెలుగు తెరపైనే లేడని చెప్పాలి. అదే సమయంలో బ్రహ్మానందం రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 

 

చివరకు రోజుల లెక్కన.. గంటల లెక్కన కూడా బ్రహ్మానందం కాల్షీట్లు ఇస్తాడని కూడా చెబుతారు. ఆ సంగతి ఎలా ఉన్నా.. కమెడియన్ గా బ్రహ్మానందం సంపాదించినంతగా ఎవరూ సంపాదించి ఉండరు. అయితే ఇప్పుడు కోట్లాధిపతి అయిన బ్రహ్మానందం గతంలో తెలుగు లెక్చరర్ అన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ ఆయన చాలా దారిద్ర్యం అనుభవించి వచ్చిన విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

 

 

ఈ విషయాలు ఆయనే తాజాగా ఓ టీవీ ఛానల్ తో పంచుకున్నారు. ఆక‌లి విలువ త‌న‌కు బాగా తెలుసున‌్న బ్రహ్మానందం త‌న తండ్రి భోజ‌నం పెట్టే వ‌ర‌కు త‌మ ఆరుగురు అన్నద‌మ్ములు ఎదురు చూసేవారట. కొన్నిసార్లు తన వరకూ భోజనం రాక కేవ‌లం మంచినీళ్లు తాగి ఖాళీ క‌డుపున ప‌డుకున్న రోజుల‌ు కూడా ఉన్నాయట. అంతటి పేదరికం నుంచి బ్రహ్మానందం వచ్చారట. అలాంటి దుర్భర దారిద్ర్యం అనుభవించిన బ్రహ్మానందం ఆ తర్వాత ఎంఏ చ‌దివి, లెక్చర‌ర్ ఉద్యోగంలో చేరి...ఆ త‌ర్వాత సినీ రంగంలోకి వచ్చారు.

 

 

ఇప్పుడు టాప్ కమెడియన్ అను అయినా తాను గతం మరచిపోనంటున్నారు బ్రహ్మానందం.. 18 రోజులు తిండి తిన‌క‌పోతే చ‌చ్చిపోతారని.. 17 రోజులు ఎవ‌రి ముందు చేతులు చాచ‌వ‌ద్దని, 18వ రోజు మాత్రమే అడుక్కోమని బ్రహ్మనందం తండ్రి చెప్పేవారట. స‌హ‌నం, ఓర్పు గురించి చెప్పే అర్హత త‌న‌కు ఉండ‌టం వ‌ల్లే...ఈ విషయం చెబుతున్నట్టు బ్రహ్మానందం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: