పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్, క్రేజ్, ఫాలోయింగ్ అన్నిటిలో సూపర్ అనిపించుకుంటాడు. యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ కెరియర్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తన క్రేజీ సినిమాలతో యువత మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ అని పేరు వినగానే వచ్చే వైబ్రేషన్స్ మాములుగా ఉండవు. సినీ అభిమానుల్లో 10 మందిలో 4 పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారంటే నమ్మాల్సిందే. అంతలా పవన్ ప్రేక్షకుల్లోకి వెళ్ళాడు. కెరియర్ మొదటినుండి యువతని టార్గెట్ చేస్తూ సినిమాలు చేసిన పవర్ స్టార్ తనకు మాత్రమే సాధ్యపడే డైలాగ్స్ కూడా చెప్పాడు. 

 

ఎమోషనల్, సెంటిమెంట్, వార్నింగ్, కామెడీ ఇలా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అదరగొట్టేసాడు. ఇక జల్సా నుండి పవన్ కు స్నేహితుడిగా ఉంటున్న త్రివిక్రమ్ తోడైతే పవర్ స్టార్ రెచ్చిపోతాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాల్లో కథ కథనాలతో పాటుగా డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. జల్సాలో అదిరిపోయే డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ అత్తారింటికి దారేదిలో పవన్ ను సింహంతో పోల్చుతూ రాసిన డైలాగ్ బాగా పేలింది. సింహం నేను ఒక్కటే.. కాకపొతే నేను గెడ్డం గీసుకుంటా అది గీసుకోదు అని చెప్పే డైలాగ్ కు థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇక అప్పుడే లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అని చెప్పడం కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించింది. 

 

పవన్ డైలాగ్స్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సుస్వాగతం సినిమాలో క్లైమాక్స్ లో డైలాగ్స్, తమ్ముడు, తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ తో డైలాగ్స్, బద్రిలో హీరో పొగరు చూపించే డైలాగ్స్, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో క్లైమాక్స్ డైలాగ్స్ ఇలా ప్రతి సినిమాలో యువతను మేలుకొలిపే డైలాగ్స్ తో పాటుగా ఎమోషనల్, సెంటిమెంట్ డైలాగ్స్ తో కూడా మెప్పిస్తాడు పవర్ స్టార్. అందుకే ఆయనంటే ఫ్యాన్స్ కు ఆ రేంజ్ లో పిచ్చి అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: