ఏడు భారతీయ భాషలలో సల్మాన్ ఖాన్ చిరంజీవి వంటి బడా హీరోలు గా కొనసాగుతున్న ప్రతి ఒక్కరి సరసన నటించిన హీరోయిన్ రంభ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. హిట్లర్, ఆ ఒక్కటి అడక్కు, బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హలో అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు లో అగ్రతారగా ఎదిగింది. అరుణాచలం సినిమాలో ప్రత్యేక నృత్యం చేసి తెలుగు తమిళ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. 

IHG
యమదొంగ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో తళుక్కుమని ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 1994 వ సంవత్సరంలో విడుదలైన హలో బ్రదర్ సినిమాలో కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాటలు అద్భుతంగా నాట్యం చేసి అందరి ఫేవరెట్ నటీమణిగా నిలిచింది. 1995 వ సంవత్సరంలో విడుదలైన మాయాబజార్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇద్దరు మిత్రులు, మృగరాజు, నాగ, దేశముదురు, యమదొంగ లాంటి చిత్రాలలో ఐటమ్ సాంగులలో నాట్యం చేసి అద్భుతః అనిపించింది. 

IHG
రంభ తమిళంలో ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ లలో నటించింది. ఉన్నరుగే నాన్ ఇరుగల్ సినిమాలో ఆమె ఓ చిన్న పాత్రలో నటించింది. ప్యార్ దివానా హోతా హై అనే హిందీ చిత్రంలో కూడా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లైన రంభ బుల్లితెరపై కూడా న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా కనిపించి బాగా అలరించింది. ఏదేమైనా రంభ సినీ ప్రేక్షకుల కోసం తన అభినయ అందచందాలను వెండితెరపై ఒలకబోసి ఎప్పటికీ గుర్తుండిపోయే నటీమణులలో ఒకరిగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: