మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య వైరం ఎంతున్నా పైకి మాత్రం తామంతా ఒక్కటే అన్నట్టుగా చిరంజీవి, బాలకృష్ణల వ్యవహారం ఉండేది. కాని ఈమధ్య బాలకృష్ణ చిరంజీవి గురించి డైరెక్ట్ గా ప్రస్థావించడం.. దాసరి ప్లేస్ ను ఎవరు ఆక్యుపై చేయలేరనే కామెంట్స్. కొందరు ఆధిపత్యం కోసం.. స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారని బాలకృష్ణ కామెంట్స్ డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా చిరంజీవికి తగులుతున్నాయి. వాటిని ఏమి పట్టించుకోనట్టు చిరు ప్రవర్తన ఉన్నా బాలయ్య కౌంటర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చేలా తన సినిమాలో డైలాగ్స్ సిద్ధం చేస్తున్నాడట చిరు.

 

కొరటాల శివ డైరక్షన్ లో ఆచర్యగా రాబోతున్న చిరంజీవి ఆ సినిమాలో తనని విమర్శించే వారందరికి సమాధానం చెప్పేలా డైలాగ్స్ ఉంటాయట. అంటే ఇన్ డైరెక్ట్ గా బాలకృష్ణ మీద కౌంటర్ వేసేలా డైలాగ్స్ రాయిస్తున్నాడని ఇన్నర్ టాక్. ఇప్పుడే కాదు ఇంద్ర సినిమాలో, మొన్నీమధ్యనే వచ్చిన ఖైది నంబర్ 150లో కూడా చిరు తనని తక్కువ అంచనా వేసిన వారందరికి కౌంటర్ పడేలా డైలాగ్స్ పేల్చాడు. ఇప్పుడు బాలకృష్ణ చేసిన కామెంట్స్ కు కూడా చిరు తనదైన సమాధానం సినిమాలో డైలాగ్స్ రూపంలో చెబుతాడని అంటున్నారు.

 

ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే లాక్ డౌన్ కొనసాగుతున్నా షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడప్పుడే పెద్ద సినిమాలేవి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ముందు ఆర్.ఆర్.ఆర్ సెట్స్ మీదకు వెళ్తుందని అనుకోగా రవిబాబు క్రష్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. షూటింగ్ స్పాట్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం సూచిస్తుంది. మరి ప్రభుత్వ ఆంక్షల ప్రకారం షూటింగ్ సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి. ఎక్కువశాతం మంది మాత్రం సెప్టెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: