మళయాళ స్టార్ హీరో దుల్క సల్మాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే పెళ్లి చేసుకున్నారు. మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా తెరంగేట్రం చేసి సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. అయితే నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ త్వరగా ఎందుకు పెల్లి చేసుకున్నాడు అంటే దానికో రీజన్ ఉందని చెబుతున్నారు. మమ్ముట్టి వల్లే దుల్కర్ త్వరగా పెళ్లి చేసుకున్నారట. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయితే పూర్తి కాన్సెంట్రేషన్ సినిమాల మీద ఉంటుందని. అప్పుడు స్టెబిలిటీతో సినిమాలు చేయొచ్చని చెప్పారట.

 

మమ్ముట్టి కూడా అలానే పెళ్లి చేసుకునారు. అందుకే దుల్కర్ సల్మాన్ కు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే పెళ్లి చేశారు. దుల్కర్ సల్మాన్ భార్య అమాల్ సుఫియాని అతనికి పర్ఫెక్ట్ పెయిర్ అని సెలెక్ట్ చేసింది మాత్రం దుల్కర్ సల్మాన్ తల్లి సుల్తాఫా అట. రెండు మూడు ఫంక్షన్స్ లో ఆమెను చూసి నచ్చి దుల్కర్ తో పెళ్లి చేశారట. ఉత్తరాదిన ముస్లీం కుటుంబానికి చెందిన మహిళ అమాల్ సుఫియా. వృత్తిరీత్యా ఆమె ఓ ఆర్కిటెక్ట్. ఇక నటుడిగా దుల్కర్ సల్మాన్ సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మహానటి సినిమాలో జెమినిన్ గణేష్ పాత్రలో దుల్కర్ చూపించిన అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్.

 

త్వరలోనే స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటి నిర్మాతలే అతన్ని మళ్లీ తెలుగు ఆడియెన్స్ దగ్గరకు తెస్తారని తెలుస్తుంది. మరి ఆ సినిమా కథ ఏంటి.. ఎవరి డైరక్షన్ లో ఆ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో దుల్కర్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడు లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. దుల్కర్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా అమ్మాయిలు అతనికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: