ఈ పాట వినగానే మాయాబజార్ లోని ఘంటసాల సంగీతం సమకూర్చి ఆలపించిన విషయం గుర్తుకు రాక మానదు. తరాలు మారినా సరే తెలుగు తెర మీద ఓ ముద్ర వేసుకుని, తెలుగు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిలో నిలిచారు ఘటసాల. 1957 మాయాబజార్ లోని ఈ పాటని పింగళి రచించగా ఘంటసాల, సావిత్రి ఆలపించారు. రేలంగి, సావిత్రిల మీద ఈ పాటని చిత్రీకరించడం జరిగింది. ఓ గొప్ప అందాన్ని పొగిడే సందర్భంలో ఇక ఇంతకంటే అందం మరెక్కడా లేదు అని దర్శకుడి ఆలోచనలను రచయిత పింగళి సాహిత్యంలో వర్ణించారు. 

 

ఇక ఇప్పుడు అది ఎందుకు  గుర్తు చేసుకున్నాం అంటే.. బాలీవుడ్ భామ దిశా పటాని కూడా తన అంద చందాలతో ఆడియెన్స్ ను తెగ డిస్ట్రబ్ చేస్తుంది. కల్విన్ క్లెయిన్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా అడ్డు అదుపులేని అందాల ప్రదర్శన చేసిన దిశా పటాని ఆ గ్లామర్ షోతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులో పూరి డైరక్షన్ లో లోఫర్ సినిమా చేసిన ఈ అమ్మడు ఆ ఒక్క సినిమాతోనే ఆగిపోయింది. అయితే తెలుగులో అవకాశాలు రాకున్నా బాల్లీవుడ్ లో అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. 

 

2019లో సల్మాన్ తో భారత్ సినిమాలో నటించి మెప్పించిన దిశా పటాని మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. ఈ ఇయర్ మలంగ్, బాగి 3 సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు సినిమాలతో పాటుగా తన ఫోటో షూట్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన ఇన్ స్టాగ్రాంలో స్కర్టులో దర్శనమిచ్చి మరోసారి అందాలతో ఊరిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఘంటసాల పాడిన సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా అని పాడాలని అనిపించక తప్పదు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

  

మరింత సమాచారం తెలుసుకోండి: