వకీల్ సాబ్ కోసం మళ్ళీ ముఖానికి రంగేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా క్రిష్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పవర్ స్టార్ 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసిన క్రిష్ ఆ సినిమాల ఫలితాలతో నిరుత్సాహపడ్డాడు. అందుకే తన నెక్స్ట్ సినిమా కచ్చితంగా హిట్టు కొట్టి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు కథ చెప్పడం దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

హిస్టారికల్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారని తెలిసిందే. ఈ మూవీకి విరూపాక్ష, బందిపోటు, గజదొంగ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే క్రిష్ ముందు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాడు కాని ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తుంది. పవన్, క్రిష్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారని అనుకోగా పాన్ ఇండియా రేంజ్ లో అంటే ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదని కేవలం తెలుగులోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో మొదటిసారి హిస్టారికల్ మూవీలో చేస్తున్నాడు. అలాంటిది ఈ మూవీ నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తే బాగుంటుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కాని క్రిష్ అండ్ టీం మాత్రం ఈ మూవీని కేవలం టాలీవుడ్ లో మాత్రమే చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్, నటన అంతా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.  మరి క్రిష్, పవన్ సినిమాపై ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.                                       
 

మరింత సమాచారం తెలుసుకోండి: