శర్వాలో నెగిటివ్ షేడ్స్ చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా.. !

NAGARJUNA NAKKA
డీసెంట్  హీరో శర్వానంద్ ... అజయ్ భూపతి డైరెక్షన్ లో రిస్కీ అటెంప్టే చేస్తున్నాడు. అది వర్కవుట్ అయితే  ఓకే. లేదంటేనే... ఎక్కడలేని చిక్కులు వచ్చి పడతాయి. ఉన్న ఇమేజ్ ..కొట్టిన ర్యాంక్ గల్లంతవుతాయి.
శర్వానంద్. ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన నటుడు. కెరియర్ తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసి కొట్టడంతో సేఫ్ జోన్ సినిమాలనే చేసుకుంటూ సాగిపోతున్నాడు. ఫుల్ లెంగ్త్  లవ్ స్టోరీస్ లలో మాత్రమే వైవిధ్యమై కథలను ఉండేలా చూసుకుంటున్నాడు. ఆ ఇదితోనే గతకొంతకాలంగా మంచి విజయాలను నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. డీసెంట్ గా హీరోగానే కాకుండా 20నుంచి 25కోట్లు కొల్లగొట్టు మిడ్ రేంజ్ హీరోలలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు.
తాజాగా శర్వానంద్  "ఆర్ ఎక్స్ 100" ఫేం అజయ్ భూపతి డైరెక్షన్ లో మహా సముద్రం చేస్తున్నాడు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ఫిలింలో హీరోయిన్ పాత్ర చనిపోవడం, పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండడం, హీరో నెగిటివ్ షేడ్ తోకనిపించడం చూస్తుంటే...  తమిళ వాసనలతో సినిమా ఉంటుందా అనే సందేహం రాకమానదు. "ఆర్.ఎక్స్ 100" మాదిరిగానే దర్శకుడు ఇందుల్లో కూడా కొత్తపాయింట్ ను తీసుకున్నట్లుగా కనిపిస్తుంది."ఆర్.ఎక్స్.100"లో హీరోయిన్ రోల్ నెగిటివ్ షేడ్ తో ఉంటే..మహా సముద్రంలో కథానాయకుడులో నెగిటివ్ షేడ్స్ ఉండడం విశేషం.
ఇక శర్వాతో జతగా అదితిరావును తీసుకోవడంతోనే సెన్సిటివ్ గా  నడిచే హీరోయిన్ పాత్ర ఉంటుందని తెలిసిపోతుంది. మరి శర్వాకు, అదితిరావుకు కెమిస్ట్ర్రీని అజయ్ భూపతి ఎలా ప్లాన్ చేశాడో చూడాలి. ఎట్ ది సేమ్ టైమ్ శర్వాను నెగిటివ్ గా చూపిస్తే ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఆలోచించాలి. ఒకవేల స్టోరి డిమాండ్ చేసి పాత్ర తీరుతెన్నులు బాగుంటే గనుక  శర్వాను ఆ విధంగా కూడా జనాలు రిసీవ్ చేసుకున్నా చేసుకోవచ్చు. చూద్దాం.. శర్వాలోని బ్లాక్ షేడ్ ఈ సారి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: