ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల వివాహం అప్పుడే?
రాహుల్ మరియు పునర్నవిలు ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, ఈ షో చూసిన వారందరికీ అర్థమవుతుంది. రాహుల్ అయితే పునర్నవిపై పెంచుకున్న ప్రేమని అస్సలు దాచుకోలేక పోయాడు. ప్రేక్షకులు చూస్తుంటారు అనే సంగతి మరచి పునర్నవిపై ప్రేమ కురిపించాడు ఈ యువగాయకుడు. బుల్లితెరపై సుధీర్ రష్మీల జోడి తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెయిర్ వీళ్లదే. వీరిద్దరి వివాహం ఒక ప్రశ్నార్థకంగా మారింది, వారి అభిమానులు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటవ్వాలని పెళ్లితో వీరి అనుబంధం మరింత బలపడాలని కోరుకుంటున్నారు.
అలాంటి ఈ జంటకి పెళ్లి కుదిరింది అంట, కుటుంబ సభ్యుల మధ్య లో ప్రేక్షకుల మధ్యలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు ఈ వినాయక చవితి సందర్భంగా ఈటీవీ వారు నిర్వహించే "2020 అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి" రియాలిటీ షోలోనిది. అందులో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి లకు ప్రేమ పెళ్లి చేస్తున్నట్లు డిజైన్ చేశారు. దీనికి ప్రముఖ సినీ సెలబ్రిటీలు సునీల్, రోజాలు ఈ పెళ్లికి పెద్దలు గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం సక్సెస్ అయి వీరిద్దరికీ మరింత పేరు రావాలని ఆశిద్దాం.