V ఓటిటిల్ రిలీజ్ దాదాపు కన్ఫాం అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. అంతేకాదు నాని v నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట చిత్రయూనిట్. v కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఎక్కడ రిలీజైనా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. అంతేకాదు నాని నెగటివ్ రోల్ లో అదరగొట్టాడని తెలుస్తుంది. ఫాస్ట్ కాపీ చూసి నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా మీద పూర్తి నమ్మకం కలిగిందట.
ఇక ఇదిలాఉంటే ఈ సినిమా ఓటిటి రిలీజ్ చేసినా థియేటర్లు ఓపెన్ అయ్యాక మళ్ళీ అక్కడ రిలీజ్ చేసేలా ఓటిటి సంస్థతో డీల్ సెట్ చేసుకున్నారట. నాని v సినిమాకు అమేజాన్ ప్రైం 35 కోట్ల దాకా ఆఫర్ చేసిందని తెలుస్తుంది. అదే నిజమైతే ఓటిటిలో తెలుగులో హయ్యెస్ట్ పెయిడ్ సినిమా నాని v సినిమానే అవుతుంది. ట్రైలర్ రిలీజ్ చేసి ఓటిటి రిలీజ్ అయినా సినిమాను బాగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీని కోసం డిజిటల్ స్పేస్ లోనే స్పెషల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.