తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెప్టెంబర్ 2 కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ రోజును రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లో ఉన్న యువత కూడా అంటే జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్ నుంచి యువ స్టార్ హీరోల వరకూ అందరూ ఆ రోజును ప్రత్యేకంగా చూస్తారు. ఇంతకీ ఆ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే...తన సినిమాలతో, వ్యక్తిత్వంతో, ఆలోచనా విధానాలతో ఒక యంగ్ జనరేషన్ (18 నుండి 40 సం..) మొత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" పుట్టిన రోజు.


ఏ స్టార్ కి అయినా వరుసగా సినిమాలు సక్సెస్ అవుతుంటే మాత్రమే ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అతని ఫాలోయింగ్... సక్సెస్ లకు అతీతంగా పెరిగిపోతూ ఉండడానికి గల కారణాలు అతని స్టైల్ మరియు వ్యక్తిత్వమే...సమాజం పట్ల, దేశం లోని సమస్యల పట్ల, తోటి వారి పట్ల బాధ్యతగా ఉండటమే కాకుండా సాధారణ వ్యక్తిలా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఉండే అతని సింప్లిసిటీ, అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే నేనున్నాను అంటూ తనకు తోచినంతలో వీలైన సాయం చేసే గొప్ప మనసు, ఆదుకునే స్వభావం గల వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతం. ఇవే అతనికి ఎప్పటికీ తరగని కీర్తిని తెచ్చి పెట్టాయి.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996లో 'అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన "కొణిదెల కల్యాణ్", తాను చేసిన ప్రతీ సినిమాలోనూ నాటి యువతను ప్రతిబింబించే లాంటి పాత్రలలో జీవించాడు. స్కూల్, కాలేజ్ చదువులు చదువుతున్న వారి దగ్గర నుంచి కెరీర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాటి నిరుద్యోగ యువత వరకూ అందరూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లోని పాత్రలను ఓన్ చేసుకొనేవారు. అవన్నీ అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలు కాకపోయినా యువతని మాత్రం ఉర్రూతలూగించిన పాత్రలు కావడం అందులో విశేషం. 

2001వ సంవత్సరంలోనే 'పెప్సీ' లాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్, కొంతకాలానికి కూల్ డ్రింక్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని జరిగిన ప్రచారం వల్లనైతేనేమి, తాను వాడని వాటి గురించి ప్రచారం చేయడం ఇష్టం లేనటువంటి పలు కారణాలతోనేమి ఇక ఎలాంటి కమర్షియల్ ఉత్పత్తులను తాను ప్రచారం చేయనని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లకూ ప్రచారం చేయలేదు.అందుకే చాలామంది "పవన్ కళ్యాణ్ యువతకు బ్రాండ్ అంబాసిడర్" అంటారు. 

Find out more: