అయితే రాబోతున్న సినిమాల్లో మళ్ళీ ఒకప్పటి పవర్ స్టార్ ను గుర్తు చేస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఈ సినిమాల్లో ఒక దానిలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యత ప్రదర్శన ఉంటుందట. అందుకే తన ఫాం హౌజ్ లో ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కథ డిమాండ్ చేస్తే షర్ట్ లెస్ గా నటించడానికి సై అంటున్నాడట పవర్ స్టార్.
ఇప్పుడంటే ఈ సిక్స్ ప్యాక్ లు గట్రా వచ్చాయి కాని అప్పట్లో పవర్ స్టార్ ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవరు. ఆయన సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభని చూపించే వారు. ప్రస్తుతం పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన అలాంటి సాహసం ఒకటి చేస్తే మాత్రం రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం. చేతుల మీద కారు టైర్లు ఎక్కిచుకోవడం.. పెంకులను పగలగొట్టడం లాంటివి చేస్తుంటాడు పవర్ స్టార్. అవి ఇప్పుడు రిపీట్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండుగే.